టాలీవుడ్ నటుడు జూ.ఎన్టీఆర్ వైసీపీ కండువా వేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను టీడీపీని వదిలేది లేదని పదేపదే ఎన్టీఆర్ చెప్తున్నప్పటికీ ఆయన మెడలో వైసీపీ కండువా వేసి ప్రచారం చేస్తుండటంతో ఆయన అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు గుడిసె పరంధామ్ సోషల్ మీడియా ఫోటోల పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లుగా ఆ పార్టీ కండువాతో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోను మార్ఫింగ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో విచారణ చేపట్టిన ఎస్సై జె.శ్రీహరి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన గుండా శ్రీధర్, రామకృష్ణ, ఎన్.సాయి, జి.వెంకటేశ్వర్లు తదితరులపై కేసు నమోదు చేశారు.