telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

ముంబై కాస్ట్ గార్డ్ లో .. ఉద్యోగాలు..

jobs in indian coast guard

రీజియన్ పరిధిలో వివిధ ఉద్యోగాలకి సంభందించి ముంబై లోని ఇండియన్ కోస్ట్ గార్డ్ వెస్టర్న్ వివిధ సబ్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 18 గ్రూప్-సీ, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ ఉద్యోగాల భర్తీకి ధరఖస్తులని కోరుతోంది.

ఖాళీలు ఉన్న ప్రాంతాలు : గోవా, ముంబై, డామన్, రత్నగిరి, కోచి.

విభాగాల వారీ ఖాళీలు: డ్రాఫ్ట్స్‌మెన్-1, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్-4, ఇంజన్ డ్రైవర్-3, సరాంగ్ లస్కర్-2, లస్కర్-8.
అర్హత: పోస్టులను బట్టి గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి ఉత్తీర్ణత; సంబంధిత ట్రేడులో కాంపిటెన్సీ సర్టిఫికెట్, డిప్లొమా, డ్రైవింగ్ లెసైన్స్‌తో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి.

వయసు: 2019, జూన్ 30 నాటికి డ్రాఫ్ట్స్‌మెన్‌కు 18-28 ఏళ్ల మధ్య, సివిలియన్ మోటార్ టాన్స్‌పోర్ట్ డ్రైవర్‌కు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. మిగిలిన పోస్టులకు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో

ఎంపిక : రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 30, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://indiancoastguard.gov.in

Related posts