telugu navyamedia
క్రీడలు వార్తలు

భార్యకు బుమ్రా బర్త్ డే విషెస్…

జస్ప్రీత్ బుమ్రా మర్చి 15న ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. స్టార్ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజనా గణేశన్‌ను అతను ప్రేమించి పెళ్లాడాడు. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో గోవా వేదికగా వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అయ్యేవరకు పూర్తి వివరాలు గోప్యంగా ఉంచిన బుమ్రా.. ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. ఎంత సీక్రెట్ మెయింటేన్ చేశారంటే.. బుమ్రా, సంజన షేర్ చేసేవరకు వారి పెళ్లి ఫొటోలు ఒక్కటి కూడా బయటకు రాలేదు. అసలు వీరికి వివాహం జరుగుతుందనే ఎవరూ ఊహించలేదు. జస్ప్రీత్ బుమ్రా తన సతీమణి సంజన గణేశన్‌ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఒక అందమైన ఫోటోను షేర్‌ చేశాడు. అంతేకాదు ఓ లవింగ్‌ పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ‘ప్రతి రోజు నా మనసు దోచుకునే నా ప్రాణమా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నా దానివి. ఐ లవ్‌ యూ’ అంటూ బుమ్రా ట్వీట్ చేశాడు. సంజన ఈరోజు తన 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. అందరూ సంజనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఐపీఎల్‌ 2021 రద్దు కావడంతో బుమ్రా, సంజన స్పెషల్ పార్టీ ఆరెంజ్ చేశారని సమాచారం.

Related posts