జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వార్తలు రావడంతో ఆ పార్టీ స్పందించింది. పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసేనని ఇందులో ఎలాంటి మార్పు జరగలేదని స్పష్టం చేసింది. కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మొద్దంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.గాజుగ్లాసు గుర్తును ప్రతి ఒక్క కార్యకర్త గమనించాలని సూచించారు.
కొన్ని దుష్టశక్తులు మన ఎన్నికల గుర్తును రద్దు చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని హరిప్రసాద్ మండిపడ్డారు. పార్టీ ప్రకటనతో పాటు, కీలక నేతల సంతకాలను ఫోర్జరీ చేసి, పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఇలాంటి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీకి సంబంధించిన ఎలాంటి ప్రకటనలైనా మీడియా విభాగం నుంచి మాత్రమే విడుదలవుతాయని వెల్లడించారు.
ఆ విషయాల్లో ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది: బీజేపీ