జనసేన పార్టీ చీఫ్, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి వేరేగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ స్టే చేసిన హోటల్ రూంకు సంబంధించిన ఫోటోలు జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. సమాజం, పర్యావరణం పట్ల ఎంత పవన్ కల్యాణ్‌కు ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఆయన గంగానది ప్రక్షాళన అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అందుకే ఉత్తర భారతంలో పర్యటించి గంగానది తీరుతెన్నులు ప్రత్యక్షంగా పరిశీలించారు. హరిద్వార్ వెళ్లిన ఆయన అక్కడి పవన్ ధామ్ ఆశ్రమంలో బస చేశారు. తాను ఓ సెలబ్రిటీ అయినా ఎంతో సాదాగా ఉన్న గదిలో గడిపారు. అయితే ఆ గది చాలా సింపుల్‌గా ఉంది. అందులో ఓ బెడ్ తప్ప మరేమీ లేవు. హరిద్వార్ లో చాలా విలాసవంతమైన కాటేజ్ లు ఉన్నాయి. పవన్ కావాలి అనుకుంటే అలాంటి కాటేజ్ లలో ఉండవచ్చని, అలా కాకుండా పవన్ ఒక చిన్న గదిలో ఉండటం ఆయన వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది అంటూ పవన్ వీరాభిమానులు ఈ ఫోటోలను షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం వివాదాస్పదమవుతోంది. పవన్ వ్యక్తిరేక వర్గం హరిద్వార్ లో పవన్ అలా నిరాడంబరంగా ఉండటంలో విశేషం ఏముంది ? ఆశ్రమాలలో నిరాడంబరంగా కాకుండా విలాసవంతంగా ఉంటారా ? అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. అంతేకాదు పవన్ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఈ ఫోటోలను బహిరంగంగా ఎందుకు లీక్ చేసారు ? ఈ ఫోటోల ద్వారా మరొకసారి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకోవాలని పవన్ ఆలోచన అని అంటూ పవన్ వ్యతిరేకులు సెటైర్లు వేస్తున్నారు. పవన్ స్టార్ సెలెబ్రెటీ హోదాను కాకుండా సాధారణ వ్యక్తిగా జీవించాలి అంటే ఇంకా అనేక త్యాగాలు చేయవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
							previous post
						
						
					

