telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాషాయ దుస్తులలో ప్రత్యక్షమైన వకీల్‌సాబ్‌

తిరుమల వెంకటేశ్వర స్వామిని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ దర్శనం చేసుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని చాలా రోజులైందని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో శ్రీవారి దగ్గరికి రాలేకపోయానని.. ఇవాళ స్వామివారి ఆశీస్సులు లభించాయని తెలిపారు. రాజకీయాలపై అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ… తిరుమలలో రాజకీయాలు మాట్లాడవద్దని… రాజీకీయాలపై తిరుపతి ప్రెస్‌మీట్‌లో మాట్లాడతానని స్పష్టం చేశారు పవన్‌ కళ్యాణ్‌. అయితే… పవన్‌ కళ్యాణ్‌ ఆలయ నుంచి బయటకు వస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాషాయ దుస్తులలో పవన్‌ ని చూసిన ఫ్యాన్స్‌ ముగ్ధులవుతున్నారు. కాగా.. వేణు శ్రీరామ్ దర్శత్వంలో రూపొందుతున్న వకీల్ సాబ్ మూవీ ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకుంది. ఈ చిత్రంలో అంజలి, నివేత థామస్, శృతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. హిందీలో హిట్టయిన ‘పింక్’ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ కలసి నిర్మిస్తున్నారు.

Related posts