నల్గొండ జిల్లా పెద్దవూర మండలం ఊరభావి తండా లో ఉన్న 5 గ్రామాలకు చెందిన గిరిజనుల మఠం వద్ద పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం కుందూరు జానారెడ్డికి ఆనవాయితీ..అందులో భాగంగా గిరిజనుల మఠం వద్ద పూజలు చేసి అక్కడి నుంచి ప్రచారం నిర్వహించారు. జానారెడ్డి మాట్లాడుతూ..రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలి అని తండా వాసులను జానారెడ్డి కోరారు. ఇక టీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత జానారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సాగర్ అభివృద్ధి విషయంలో టీఆర్ఎస్ నేతలు, మంత్రులు అవగాహన రాహిత్యంతో తనపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నేతలు చేసే విమర్శలకు స్పందించాల్సిన స్థాయి తనది కాదన్న ఆయన అధికార పార్టీ నేతలు ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు. సాగర్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ చర్చకు వస్తే తాను స్పందిస్తానని జానారెడ్డి స్పష్టం చేశారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది నేతల విమర్శల ధడి పెరుగుతుంది. అయితే చూడాలి మరి ఇంకేద ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తారు అనేది.
							previous post
						
						
					
							next post
						
						
					


సమాజంలో మహిళల పట్ల చులకనభావం పోవాలి: కోదండరాం