telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

తన ప్రేమికను పరిచేయ చేసిన పంత్…

ఈ మధ్య వరుసగా భారత క్రికెటర్లు పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా భారత పేసర్ బుమ్రా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పుడు భారత యువ వికెట్ కీపర్ ప్రముఖ మోడల్‌ ఇషా నేగితో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ విషయాన్ని అతనే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు. ఇషా నేగితో చనువుగా దిగిన ఓ ఫోటోను షేర్ చేసిన పంత్.. ‘నిన్ను నేనెప్పుడూ హ్యాపీగా ఉంచాల‌నుకుంటున్నాను.. ఎందుకంటే నేను హ్యాపీగా ఉండ‌టానికి నువ్వే కారణం’అనే క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో వీరిద్దరూ పీకల్లోతూ లవ్‌లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వశీ రౌటేలాతో ఈ ఢిల్లీ యువ ఆటగాడు గతంలో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు ఇషా కూడా పంత్‌పై తనకున్న ప్రేమను బహిర్గతం చేసింది. ఆమె కూడా పంత్‌తో దిగిన ఫోటోలను త‌న ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘నువ్వే నా మ‌గాడివి, నువ్వే నా ఆత్మవి, నా బెస్ట్ ఫ్రెండ్‌వి, నా జీవితంలోని ప్రేమవి నువ్వే’అని క్యాప్షన్‌గా రాసుకొచ్చింది.

Related posts