ఏపీ విద్యార్థులకు సిఎం జగన్ శుభవార్త చెప్పారు. జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అందించనుంది ఏపీ సర్కార్. ఇవాళ ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా తల్లుల అకౌంట్ కు డబ్బు జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. 2020-21 విద్యా సంవత్సరానికి 10.88 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు సొమ్ము అందించనుంది ఏపీ సర్కార్. మొత్తం 671.45 కోట్లు జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. ఇప్పటి వరకూ మొత్తం 4879 కోట్లు విద్యాదీవెన కింద జమ చేసింది ప్రభుత్వం. ఇక ఈ నెల 28న వసతి దీవెన మొదటి విడత ప్రారంభం కానుంది. కాగా ఏపీలో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ఇవాళ హై లెవల్ మీటింగ్ జరుగనుంది. నియంత్రణ పై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పదవ తరగతి పరీక్షలు రద్దు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా.. రాత్రిపూట కర్వ్ఫూ పెట్టే ఆలోచనలో ఉంది సర్కార్. అలాగే ఇంటర్ పరీక్షలు వాయిదా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. స్కూళ్లకు శెలవులు, దేవాలయాల్లో, మత సంస్థల్లో సైతం కరోనా ఆంక్షల పెట్టే అవకాశం కనిపిస్తోంది. బార్లు, రెస్టారెంట్ల పై ఆంక్షలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
previous post
next post

