telugu navyamedia
క్రీడలు వార్తలు సినిమా వార్తలు

సచిన్ కు బర్త్ డే విషెస్ చెప్పిన టాలీవుడ్ స్టార్స్…

Sachin tendulkar

ఈరోజు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజును. ఈ సందర్భంగా సచిన్ కు సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రిటీల నుంచి, అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి “మీరు బిలియన్ల హృదయాలను గెలుచుకున్నారు. బిలియన్ల భావోద్వేగాలను కదిలించారు. బిలియన్ ప్రజల కలలను సాకారం చేశారు. బిలియన్ మనస్సులను ప్రేరేపించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు డియరెస్ట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్” అంటూ పోస్ట్ చేశారు. కాగా చిరంజీవి, సచిన్ ఒక ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ కోసం కూడా అసోసియేట్ అయి ఉన్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో తనకు షూటింగ్ లు లేనప్పుడు తరచూ స్టాండ్లలో కన్పించి టీం ఇండియాను ఉత్సాహపరచడం మనం చూశాం. “క్రికెట్‌ను ఎప్పటికీ పునర్నిర్వచించిన వ్యక్తి… పుట్టినరోజు శుభాకాంక్షలు సచిన్. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ఇక విక్టరీ వెంకటేష్ క్రికెట్ లెజెండ్‌ సచిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనపై తమకు ఉన్న అభిమానాన్ని వెల్లడించారు. 

Related posts