telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో కరోనా విజృంభణ : సీఎం జగన్ కీలక నిర్ణయం !

cm Jagan tirumala

ఏపీలో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ఇవాళ హై లెవల్ మీటింగ్ జరుగనుంది. నియంత్రణ పై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పదవ తరగతి పరీక్షలు రద్దు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా.. రాత్రిపూట కర్వ్ఫూ పెట్టే ఆలోచనలో ఉంది సర్కార్. అలాగే ఇంటర్ పరీక్షలు వాయిదా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. స్కూళ్లకు శెలవులు, దేవాలయాల్లో, మత సంస్థల్లో సైతం కరోనా ఆంక్షల పెట్టే అవకాశం కనిపిస్తోంది. బార్లు, రెస్టారెంట్ల పై ఆంక్షలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మార్కెట్లు, దుకాణాల విషయంలో సమయం ఆంక్షలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అటు వ్యాక్సినేషన్, కోవిడ్ కేర్ సెంటర్ల పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది సర్కార్. వాలంటీర్లతో ఇంటింటికి ఆరోగ్య సర్వే చేయించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం.

Related posts