నేడు సోమవారం (ఆగస్టు23) ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి క్యాంప్ కార్యాలయంలో పూలుజల్లి నివాళులర్పించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనమని ఆయన కొనియాడారు.
‘‘తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి’’ అని జగన్ ట్వీట్ చేశారు.
తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2021