కరోనాను తరిమికొట్టేందుకు దేశ పౌరులంతా ఈరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని విద్యుత్ లైట్లు అన్నీ ఆఫ్ చేసి.. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఒకే సారి లైట్లు ఆఫ్ చేస్తే విద్యుతు గ్రిడ్ ల పై ప్రభావం పడే ప్రమాదముందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు రాత్రి ఒకేసారి లైట్లు ఆపితే వచ్చే ఇబ్బంది ఏమీ లేదని అన్నారు. ప్రతి రోజు విద్యుత్ వినియోగంలో 2, 3 వేల మెగావాట్లు తేడా వచ్చినా ఎదుర్కొంటున్నామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. లైట్లు ఆపివేయడం వల్ల చాలా తక్కువ తేడా ఉంటుందని, 700 మెగావాట్ల లోపే తేడా వస్తుందని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుని జ్యోతి వెలిగించే కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.


ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనం ఈ బడ్జెట్: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి