telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇంట్లో తీవ్ర విషాదం..

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి నారాయణ గౌడ్‌ ఇవాళ మృతి చెందారు. గత కొంతకాలంగా నారాయణ గౌడ్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంలో ఇవాళ ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా.. శ్రీనివాస్‌గౌడ్‌ను ఎమ్మెల్సీ కవిత, మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్‌, దామోదర్‌రెడ్డి పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న మంత్రి తల్లి గారిని కవిత ఓదార్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Related posts