telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గతం మర్చిపోకూడదు… దొరబాబు భార్య కామెంట్…

jabbardast

వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడుల్లో జబర్దస్త్‌ కామెడీ షో నటులు దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు. మాధవ దారిలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు పక్కా సమాచారం అందడంతో పోలీసులు జరిపిన దాడిలో ఒక మహిళతో పాటుగా జబర్దస్త్‌ కామెడీ షో ఆర్టిస్టులు దొరబాబు, పరదేశిలతో సహా ఇద్దరు నిర్వాహకులు, మరో ఇద్దరు విటులు పట్టుబడ్డారు. అసలు ఆ రోజు రాత్రి అక్కడ ఏమి జరిగిందో పలు రకాలుగా ఊహాగానాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దొరబాబును ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమూల్య విమర్శకులకు గట్టిగా జవాబిచ్చారు. ఈ క్రమంలోనే ‘ఓ వ్యక్తిని అపార్ధం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్ధం అవుతాయి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోకూడదు’. అంటూ తన భర్త దొరబాబును ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. అది కాస్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Related posts