telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్.ఆర్.ఆర్. స్క్రిప్ట్ .. శ్రద్దా కపూర్ కోసం.. మార్చేశారా .. !

is rajamouli script changing for sradha kapoor

భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్వకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ ఆడియన్స్ దృష్టిని తెలుగుతెర వైపు తిప్పిన ‘బాహుబలి’ సిరీస్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న మరో సినిమా కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు చిత్రంలో యంగ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ హీరోలుగా నటిస్తుండటంతో ఆ అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చిన నాటినుంచే సెన్సేషన్ అవుతోంది. చారిత్రాక నేపథ్యం ఉన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా ఆలియా భట్, బ్రిటీష్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్‌ని ఎంపిక చేశారు జక్కన్న.

కొన్ని కారణాల వల్ల డైసీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో, ప్రేక్షక లోకంలో ఆమె స్ధానంలో ఎవరిని తీసుకుంటారా అనే కుతూహలం ఎక్కువైంది. ఈ లోగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్‌ని డైసీ ప్లేస్‌లో తీసుకున్నారనే వార్త బాగా వైరల్ అయింది. ఈ విషయమై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ.. దానికి పొడగింపుగా మరో ఆసక్తికర వార్త ప్రస్తుతం తెగ హల్ చల్ చేస్తోంది. శ్రద్ధా కపూర్ కోసం రాజమౌళి స్ర్కిప్టులో కొన్ని మార్పులు చేర్పులు చేశారనేది ఆ వార్త సారాశం. ఈ వార్తల్లో నిజమెంతవరకుందో.. రాజమౌళినే స్పష్టం చేస్తే కానీ తెలియదు!

Related posts