ఇరాన్ దేశంలోని గోగోన్ నగరంలో యోగా చేస్తున్న 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. యోగా నేర్చుకుంటున్న వారితో పాటు నిర్వహిస్తున్న యోగా టీచర్‌ను సైతం అరెస్ట్ చేశారు. లైసెన్స్ లేకుండా యోగా క్లాసులను నిర్వహించడం, ఆడ, మగవారికి కలిపి యోగా నేర్పుతుండటమే అరెస్ట్‌కు కారణమని అధికారులు తెలిపారు. ఇరాన్ ప్రభుత్వం ప్రకారం.. అక్కడ లైసెన్స్ లేకుండా యోగా క్లాసులను నడపడం నేరం. పైగా లైసెన్స్‌తో నడిపేవారు కూడా కేవలం ఆడవారికి లేదా మగవారికి వారికి మాత్రమే నేర్పాలి. రిథమిక్ మోషన్స్, జుంబా లాంటి డ్యాన్స్‌లను సైతం నిషేధిస్తున్నట్టు 2017లో ఇరాన్ క్రీడాశాఖ ప్రకటించింది. ఒక్క యోగానే కాదు ఇరాన్‌లో ఏ విధమైన క్రీడల శిక్షణలో అయినా ఆడవారికి, మగవారికి కలిపి శిక్షణ ఇవ్వకూడదు.
previous post
next post