telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మూడు రోజుల ముందే వైట్ హౌస్ లో దీపావళి సంబరాలు

trump in america president election race

దీపావళి పండగ సందడి అమెరికాలో అప్పుడే మొదలైంది. భారత్ లో దీపావళి వేడుకలను జరుపుకోవడానికి మూడు రోజుల ముందే అమెరికాలో దీపావళి సంబరాలు జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీపావళి సంబరాల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. తన అధికారం నివాసం వైట్ హౌస్ లో ట్రంప్ గురువారంనాడు దీపావళి జరుపుకోనున్నారు.

2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా వైట్ హౌస్ లో దీపావళి వేడుకలను ప్రారంభించారు. 2017లో భారత సంతతి అమెరికా నేతలతో కలసి ట్రంప్ తొలి సారి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గత ఏడాది దీపావళి వేడుకలకు అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ సింగ్ ను ట్రంప్ ఆహ్వానించారు. దీపావళి వేడుకలను ట్రంప్ జరుపుకోనుండటం ఇది మూడోసారి.

Related posts