ఐపీఎల్ 2020-21 షెడ్యూల్ రిలీజ్ అయింది. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్ మ్యాచ్లు జరుగనున్నాయి. ప్లే ఆఫ్స్తో పాటు ఫైనల్ మ్యాచ్కు మొతేరా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మిగతా మ్యాచ్లు చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీలో జరుగనున్నాయి. మే 30న మొతేరా స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్స్ జరుగనుంది. ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ -2021 సీజన్ జరుగనుంది. అహ్మదాబాద్ ఢిల్లీలో 8, మిగిలిన నాలుగు వేదికల్లో 10 మ్యాచ్లు జరుగుతాయి. ఇక తొలి మ్యాచ్ చెన్నై వేదికగా బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మధ్య జరుగనుంది. ఇది ఇలా ఉండగా.. ఈ సీజన్లో హైదరాబాద్ లో ఎలాంటి మ్యాచ్లు లేకపోవడం గమనార్హం. దీంతో హైదరాబాద్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. కాగా.. హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ బీసీసీఐ, ఐపీఎల్ యజమాన్యానికి విజ్ఙప్తి చేసిన సంగతి తెలిసిందే.


హృతిక్ డాన్స్ మూవ్మెంట్స్ చూసి బెదిరిపోయాను… వాణి కపూర్