telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పాతబస్తీ లో ఘర్షణ… కారణం ఏంటంటే..?

Hyderabad

హైదరాబాద్ పాతబస్తీ ఉప్పుగూడ కాళికా మాతా దేవాలయంకు సంబంధించిన 24,25,26 సర్వే నెంబర్లల్లోని 70 కోట్ల విలువ గల 7 ఎకరాల 13 గుంటల స్థలంలో ఘర్షణకు దారితీసింది. దేవాదాయ శాఖ కు చెందిన స్థలాన్ని ఓ వ్యక్తి ఆ స్థలం నాది అని సిటిసివిల్ కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ అర్దర్లు తీసుకోవడం…ఘటనా స్థలంలో పోలీసుల సమక్షంలో నిర్మాణాలు చేపడుతుండడంతో స్థానికులు బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో మహిళలను, వృద్ధులు, బీజేపీ నాయకులను పోలీసులు ఈడ్చుకుంటూ పోలీస్ వాహనాల్లో తరలిస్తుండడంతో తీవ్ర ఉద్రిక్తత కు దారితీసింది.. 1951 లో ఈ స్థలాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకొని ఇప్పటివరకు 11 సార్లు వేలం పాట చేస్తున్నట్లు ప్రకటనలు చేశారు . ఒక సారి వేలం పాట కూడా నిర్వహించింది. వేలం పాటలో ధర తక్కువ గా వచ్చిందని సీపీఐ నాయకులు దేవాదాయ శాఖ ముందు ధర్నా నిర్వహించారు. అప్పట్లో హై కోర్టును ఆశ్రయించడంతో వేలం పాట రద్దు చేశారు. అప్పటి నుంచి రాని ఓ వ్యక్తి ఆ స్థలం ఆలయ ట్రస్టీ తనకు అమ్మిందని ఆలయ భూముల్లో చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మిస్తుండగా బీజేపీ నాయకులు, స్థానికులు అడ్డుకున్నారు. నా భూముల్లో నేను నిర్మాణాలు చేసుకుంటుంటే స్థానికులు అడ్డు పడుతున్నారని సిటీ సివిల్ కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని అర్దర్లు తీసుకొని రావడం.. పోలీసులు ఎద్ద ఎత్తున బుధవారం ఆలయ స్థలం కు చేరుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న బీజేపీ నాయకులు స్థానికులు అక్కడికి చేరుకొని అడ్డు కోవడంతో ఘర్షణకు దారితీసింది..

Related posts