telugu navyamedia
ఆంధ్ర వార్తలు ఆరోగ్యం వార్తలు సామాజిక

రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సి.ఎస్. బి.రాజశేఖర్ ఆద్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణతో పాటు సచివాలయ ఉద్యోగులు అంతా పెద్ద ఎత్తున పాల్గొని యోగా మాస్టర్స్ సూచనల మేరకు పలు రకాల యోగాసనాలను అభ్యసించారు.

రాష్ట్ర సచివాలయ ప్రాగణంలోని సెంట్రల్ పార్కులో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు పెద్ద ఎత్తున ఉద్యోగులు అంతా ఉదయం 6.30 గంటలకే చేరుకుని పలు రకాల యోగాసనాలను దాదాపు ఒక గంటపాటు అభ్యసించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు పలు రకాల యోగసనాలను అభ్యసిస్తూ ప్రపంచ యోగా దినోత్సవ సమ్మేళనానికి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షకు పైగా ప్రాంతాల్లో 2 కోట్ల మంది ప్రజలు పాల్గొనేలా నిర్వహించిన ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రాష్ట్ర సచివాలయ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ మల్లికార్జునరావుతో పాటు పలు సచివాలయంలోని పలు శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

(సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం వారిచే జారీ)

Related posts