telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

యోగాంధ్ర పై జగన్ చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా, గిన్నిస్ రికార్డు స్థాయిలో చేపట్టిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంపై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రజల డబ్బు వృథా చేస్తున్నారంటూ జగన్ చేసిన ఆరోపణలను చంద్రబాబు తిప్పికొట్టారు. విశాఖలో శనివారం ఆయన ఈ విషయంపై స్పందించారు.

“కొన్ని సందర్భాల్లో కొందరి గురించి మాట్లాడటం కూడా అనవసరం. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వ్యక్తులు ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది” అని చంద్రబాబు విమర్శించారు.

రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా, కలుషితం చేసేలా ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

“ఇలాంటి భూతాన్ని  ప్రజలను తప్పుదోవ పట్టించే వారిని ఉద్దేశించి ఎలా నియంత్రించాలో ప్రజలకు వివరించి వారిని చైతన్యపరుస్తాం” అని చంద్రబాబు తెలిపారు.

యోగాంధ్ర కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు సహకారం అందించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

“యోగాంధ్ర కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది. ప్రజల శ్రేయస్సు కోసమే ఈ కార్యక్రమం చేపట్టాం” అని చంద్రబాబు వివరించారు. ప్రజల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో మేలు చేస్తుందని, అలాంటి కార్యక్రమాలపై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

Related posts