“శభాష్ నారా లోకేష్!” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అభినందించడం, నేటి యోగా దినోత్సవ కార్యక్రమం విజయవంతం కావడంలో మంత్రి నారా లోకేష్ కృషికి లభించిన గొప్ప గుర్తింపు.
“యోగాను కేవలం ఒక దినోత్సవంగా కాకుండా, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఒక సామాజిక ఉత్సవంగా తీర్చిదిద్దాలనే లోకేష్ ఆలోచన, దాన్ని ఆచరణలో పెట్టేందుకు గత నెలన్నర రోజులుగా ఆయన చేసిన అవిశ్రాంత కృషి అభినందనీయం.
ఇటువంటి బృహత్తర సామాజిక కార్యక్రమాన్ని ఇంత సమర్థవంతంగా నిర్వహించి, దేశ ప్రజలందరికీ ఒక ఆదర్శ నమూనాగా నిలపడం లోకేష్ కార్యదక్షతకు నిదర్శనం.” అని ప్రధాని నరేంద్ర మోడీ లోకేష్ ను ప్రశంసించారు.