ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ మోస్ట్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ మూవీ“పుష్ప: ది రైజ్-పార్ట్ 1”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం మొత్తం రెండు భాగాలుగా రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండలలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. సినిమాలోని ఓ సాంగ్ అద్భుతమైన లొకేషన్లో షూటింగ్ జరుపుకుంది అంటూ ఆ ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ సినిమాలోని రెండోపాట విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి సాంగ్ “దాక్కో దాక్కో మేక”కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరోవైపు ఫస్ట్ చార్ట్ బస్టర్ సాంగ్ మొత్తం 5 భాషల్లో రికార్డు చేసి ఒకేసారి మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరి అలానే ఇప్పుడు రెండో సాంగ్ కూడా పలు భాషల్లో స్టార్ సింగర్స్ చేత దేవి ఆల్రెడీ పాడిస్తున్నాడట. అంతే కాకుండా ఆల్రెడీ నాలుగు భాషల్లో సాంగ్స్ రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకొకటి కూడా కంప్లీట్ చేస్తే త్వరలోనే ఈ సాంగ్ ని కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా మొదటి భాగం “పుష్ప : ది రైజ్-పార్ట్ 1″ను డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.


వరుణ్ ధావన్‌కు ఇద్దరు హీరోల వల్లే కష్టాలు…!?