మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున ఎన్నికల బరిలోకి దిగిన బండ్ల గణేష్.. ఆ తర్వాత ప్రకాష్ రాజ్‌కు షాక్ ఇచ్చారు.. ప్యానల్ నుంచి బయటకు వచ్చి మా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు..
అంతే కాదు.. జీవిత రాజశేఖర్.. ప్రకాష్ రాజ్ ప్యానల్‌లోకి రావడం తనకు ఇష్టం లేదన్న బండ్ల.. అందుకే ప్యానల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి వేడి పుట్టించారు. . జీవితపైనే తాను పోటీ చేస్తానని వెల్లడించారు.. ఆమె మెగా ఫ్యామిలీని ఎన్నోసార్లు కించపరిచారంటూ పాత గొడవలను కూడా తవ్వాడు..
అయితే, బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు జీవిత రాజశేఖర్..‘మా’లో సభ్యులుగా ఉన్న వారు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఆమె మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాను గెలిచినా లేదా ఓడినా ‘మా’ అభివృద్దికి పనిచేసి తీరతానన్నారు.
ఇక బండ్ల గణేష్ అంటే నాకు డోంట్ కేర్ అని, బండ్ల గణేష్ గురించి మాట్లాడడం టైం వేస్ట్.. ‘మా’ గురించి మాట్లాడకుండా చిరంజీవి ఇష్యూ ఎందుకు మాట్లాడడం? అని ప్రశ్నించారు. బండ్ల గణేష్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.. నా బతుకు గురించి బండ్ల గణేష్‌కు ఎందుకు? నేను పార్టీలు మారితే మీకు వచ్చిన నష్టం ఏంటి? నేను రాజకీయ పార్టీలు మారితే బండ్ల గణేష్‌కు వచ్చిన కష్టమేంటి..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన జీవిత.. పార్టీలు మారడం అనేది నా ఇష్టం అన్నారు.. ఒకే పార్టీలో ఉండి వెనక గోతులు తవ్వితే గొప్పోడా అంటూ ప్రశ్నించారు.
మా ఆస్తులు అమ్ముకొని చేతనైనంత సహాయం చేశామన్న ఆమె.. మెగా ఫ్యామిలీని చాలా మంది విమర్శించి ఉంటారు.. వాళ్లందర్నీ వెలివేస్తారా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“సాహో” డైలాగ్ స్పూఫ్ పై పృధ్వీ వివరణ