telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వరుణ్ ధావన్‌కు ఇద్దరు హీరోల వల్లే కష్టాలు…!?

Varun-Dhawan

ఎప్పటికప్పుడు రివ్యూలు ఇస్తూ, రియాల్టీ షోలలో పాల్గొంటున్న కంటెస్టెంట్లపై, నటీనటులపై ప్రముఖ సినీ విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే ఆయన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. తాజాగా ఆయన బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడైన వరుణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అయితే ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేనివారు వరుణ్‌కి గట్టి పోటీనిస్తున్నారు. వారే కుర్ర హీరోలు ఆయుష్మాన్ ఖురానా, కార్తిక్ ఆర్యన్. వీరిద్దరికీ ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేదు. సొంత టాలెంట్‌ను నమ్ముకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వీరు నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్నాయి. ఈ విషయం గురించి కమాల్ ట్వీట్ చేస్తూ ఏమన్నారంటే… ‘‘వరుణ్ ధావన్ ఓ ఫ్లాప్ నటుడు. వరుసగా ఆరు ఫ్లాప్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ‘మిస్టర్ లేలే’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది అని మీరు కూడా అనుకుంటున్నారా? మరో విషయం ఏంటంటే… పాపం వరుణ్ ధావన్‌కు ఇద్దరు హీరోల వల్లే కష్టాలు ఎదురయ్యాయి. వారెవరో కాదు. ఆయుష్మాన్ ఖురానా, కార్తిక్ ఆర్యన్. వీరిద్దరూ వరుణ్‌కు చుక్కలు చూపిస్తున్నారు. వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాల కెరీర్లు నాశనం అవ్వడానికి ఈ ఇద్దరే కారణం’ అని బాంబు పేల్చాడు.

Related posts