ఏపీలో ఈసారి ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగాయి.
ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చాక మునుపెన్నడూ లేనంతగా పెద్ద సంఖ్యలో పోలీసులు, అధికారులపై వేటు పడింది.
ఈ నేపథ్యంలో, నిఘా వర్గాల నుంచి ఏపీకి హెచ్చరిక జారీ అయింది. జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందన్నది ఇంటెలిజెన్స్ హెచ్చరికల సారాంశం.
జూన్ 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు నిఘా విభాగం నుంచి హెచ్చరికలు అందాయి.
ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతుండగా, జూన్ 4న ఫలితాల వెల్లడితో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


బలనిరూపణ వెనుక బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్: కుమారస్వామి