telugu navyamedia
క్రీడలు

హాకీలో చరిత్ర సృష్టించిన భారత జట్టు

ఒలింపిక్స్‌లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. 41 ఏళ్ల త‌రువాత హాకీ జ‌ట్టు ఒలింపిక్స్‌లో ప‌త‌కం సాధించింది. టోక్యో నడిబొడ్డున్న త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జయాహో భారత్ అనే నినాదాలు మార్మోగాయి. నాలుగు క్వార్ట‌ర్ లుగా సాగిన ఆట హోరాహోరీగా సాగింది. రెండు క్వార్ట‌ర్‌లు ముగిసే స‌రికి 3-3 గోల్స్‌తో స‌మంగా ఉన్నాయి. అయితే, మూడో క్వార్టర్ లో ఇండియా లీడ్ సాధించి రెండు గోల్స్ చేసి 5-3 ఆధిక్యాన్ని సాధించింది. కీల‌క‌మైన నాలుగో క్వార్ట‌ర్ ఆదిలోనే జ‌ర్మ‌నీ జ‌ట్టు గోల్ చేసి లీడ్‌ను 5-4కి త‌గ్గించింది. ఇక అక్కడి నుంచి మ్యాచ్‌ ఉత్కంఠంగా మారింది. మరో గోల్‌ దక్కకుండా చాలా ప్రయత్నించింది భారత్‌. ఆఖర్లో జర్మనీకి దక్కిన పెనాల్టీ కార్నర్‌ విఫలం కావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. చివరి సెకన్ల ‍వ్యవధిలో దక్కిన జర్మనీ షూట్‌ అవుట్‌ పెనాల్టీని అడ్డుకోవడంతో.. ఇండియా జ‌ట్టు 5-4 గోల్స్ తేడాతో జ‌ర్మ‌నీపై విజ‌యం సాధించి కాంస్య‌ప‌త‌కాన్ని గెలుచుకుంది. టీమ్‌ ఇండియా నుంచి సిమ్రన్‌ జీత్‌ సింగ్‌ (17,34), హార్దిక్‌ సింగ్‌ (27), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌(29), రూపిందర్‌ పాల్‌ సింగ్‌(31) గోల్స్‌ చేశారు.

Related posts