మొతేరా స్టేడియంలో కాసేపట్లో భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టీ 20 జరుగనుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకున్నది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన టీం ఇండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇక టీం ఇండియా ఈ మ్యాచ్‌లో పలు మార్పులు చేసింది. యంగ్ క్రికెటర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్‌లను జట్టులోకి తీసుకుంది. తద్వారా వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్ నుంచి ధావన్, అక్షర్ పటేల్‌లను తప్పించింది. కాగా ఈ మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మను తుది జట్టులోకి తీసుకోలేదు. ఇక జట్లు వివరాల్లోకి వస్తే…
ఇండియా : విరాట్ కోహ్లీ {కెప్టెన్}, రాహుల్, రిషబ్, ఇషాన్ కిషన్, అయ్యర్, సూర్యకుమార్, పాండ్య, సుందర్, శార్ధూల్ ఠాకుర్, భువనేశ్వర్‌కుమార్, చాహల్
ఇంగ్లండ్ : జేసన్ రాయ్, బట్లర్, డేవిడ్ మలన్, బెయిర్‌స్టో, మోర్గాన్ {కెప్టెన్}, స్టోక్స్, సామ్ కరన్, ఆర్చర్, టామ్ కరన్, జోర్డాన్, అదిల్ రషీద్
previous post

