భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. భువనేశ్వర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 63. క్యాన్సర్‌తో గతకొన్నిరోజులుగా పోరాడుతున్న ఆయన ఈరోజు మీరట్‌లోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దీంతో భువీ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. కిరణ్‌పాల్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లో పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి.. కొన్నేళ్ల క్రితం రిటైరయ్యారు. ఇక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇటేవలి కాలంలో భారత పురుష, మహిళా ప్లేయర్స్ తమ కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు. 63 ఏళ్ల కిరణ్ పాల్ సింగ్ గతకొన్నిరోజులుగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. నోయిడా మరియు ఢిల్లీలో అయన మెరుగైన కీమోథెరపీ చికిత్స కూడా చేయించుకున్నారు. కొన్ని వారాల క్రితం పాల్ సింగ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో మీరట్‌లోని ఆసుపత్రిలో చేరారు. ఆపై మెరుగైన వైద్యం కోసం ముజఫర్ నగర్‌లోని మరొక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కిరణ్ పాల్ సింగ్ కన్నుమూశారు.
							previous post
						
						
					
							next post
						
						
					

