telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కరోనా డేంజర్ బెల్స్… క్యూ లైన్ లో శవాల గుట్టలు

మోగిస్తోంది నగారా భీకర యుద్ధానికి సిద్ధం కమ్మని…!

సర్వ శక్తులూ కూడగట్టుకుని గూటిలో గువ్వల్లాగా బిక్కుబిక్కుమంటూ ఒదిగిపోదాం…!

చెట్టుకొమ్మలను కదిలిస్తుందేమోననుకుంటే…

కూకటి వేళ్ళతో పెకలించాలని చూస్తోందే ఇది…!

చుట్టూ మిన్నంటుతున్న హాహాకారాలు…

కడుపుకోత తో దద్దరిల్లుతున్న భూమాత…

ఆ శోకం చెవుల్లో గింగిరాలు తిరుగుతోంది…!

అదేంటి…ఊపిరందక ఉక్కిరిబిక్కిరవుతోంది ప్రాణం…గాలిలో రెపరెపలాడే దీపమైంది ఆయువు…!

అయ్యో…! శ్మశానాల ముందు ఏంటా కలకలం…?

ఏదో తొక్కిసలాట జరుగుతోందక్కడ…

శవాలు కొట్లాడుకుంటున్నాయ్ క్యూలైన్లలో నిలబడటానికి…!

ఆసుపత్రుల ముందు పడిగాపులు పడ్డ ప్రాణాలు విగతజీవులై కుళ్ళు కంపు కొడుతున్నాయి…

ఇదంతా స్వయంకృతాపరాధమే కదా…!

నిర్లక్ష్య వైఖరి చివరకు మృత్యురూపం దాల్చి…

తీతువుపిట్టై దుశ్శకునాలు పలుకుతోంది…!

అవును…కరోనా చేతులు చాచి కబళించేందుకు వేగంగా వచ్చేస్తోంది…

బహు పరాక్…!!

Related posts