telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పాకిస్థాన్ లో ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడంలో అక్కడి విఫలమైంది. ప్రపంచ ఉగ్రవాద నియంత్రణా సంస్థ ఫైనాస్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) చెప్పిన 6 పనులను చేయడంలో పాకిస్తాన్ పనితీరు చెత్తగా ఉంది. అంతేకాకుండా న్యూఢిల్లీ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందని వెల్లడించింది. పాకీస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉగ్రవాదులను ఉంచిందని, వారికి కావలసిన సదుపాయాలను చేస్తోందిని పాకిస్తాన్‌ను నిలదీసింది. దాంతో పాటు డ్రోన్‌ల ద్వారా ఆయుధాలను కూడా సరఫరా చేస్తుందని చెప్పింది. అంతేకాకుండా సీజ్ ఫైర్ వయలేషన్ (సీఎఫ్‌వీ)ను ఒక్క ఏడాదిలో 3800 సార్లు అతిక్రమించిదని, వాస్తవాధీన రేఖకు చేరువలో ప్రజాప్రాంతాల్లో ఆయుధాలను మరిన్ని ఇతర వస్తువులను పడేసిందిన భారత్ వెల్లడించింది. ప్రస్తుతం ఎఫ్ఏటీఎఫ్ జాబితాలో పాకిస్తాన్ గ్రే లిస్ట్‌లో ఉందని, ఇస్లామాబాద్ వంటివి గ్రే లిస్ట్‌ నుంచి బయటకు రాకూడదని భారత్ సూచించింది. అయితే ఎఫ్ఏటీఎఫ్ పెట్టిన నిబంధనలను పూర్తి చేయని దేశాలను గ్రే లిస్ట్‌లో ఉంచుతారు. పాకిస్తాన్ వంటి దేశాలు అందులోనే ఉండాలని భారత్ కోరింది. పాకీస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాద సంస్థలకు సహాయం చేస్తుందని, మసూద్ అజార్, దావూద్ ఇబ్రహిమ్, జాకిర్ ఉర్ రెహ్మాన్ లాఖ్వి మొదలైన వారికి రక్షణ కల్పించి పాక్ ఉగ్రవాదాన్ని బలోపేతం చేసిందని భారత్ తెలిపింది.  

Related posts