telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

యుక్త వయస్సు…

యుక్త వయస్సులో ఆడుతూ పాడుతూ
ఎదిగే చిన్నారులపై శరీరంలో జరిగే ఓ మార్ప
దయా దాక్షిణ్యం చూపక
కర్కశంగా నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తుంది..
తెలిసీ తెలియని వయస్సు
అనే జాలిచూపదు.
ఎదిగే వయ్యస్సును
రక్తపు బొట్టు రూపంలో పీల్చేస్తుంది.
సృష్టికి ప్రతిసృష్టి నువ్వు
చేయాలంటే తప్పదంటుంది.
ఇంట్లోనే ఓ మూలన కూర్చునేలా చేస్తుంది.
కడుపులో ప్రేగులు మెలిపెడుతున్నా
ఎక్కడ లేని కోపాన్ని దిగ మ్రింగుతుంటే
తల నెప్పిని,అసహనాన్ని కానుకిస్తుంది.
మాతృమూర్తిగా నువ్వు పరిణితి చెందాలంటే
ప్రతి నెలా భరించక తప్పదంటూంది
నీ హితం కోసమే ఇలా అంటుంది.
బ్రహ్మ లిఖితమిది కాదనలేర్వరంటుంది
ప్రతి ఆడపిల్ల తన చేతిలో విలవిలే.
ఇదో సృష్టి కార్యం .
ఆపినా ఆగని సృష్టి నియమం.
ఆడపిల్లకు మాత్రమే ఐదు రోజుల నరకం.
స్త్రీకిది వరమో(శాపమో)!
సృష్టిని ధిక్కరించ లేని విధి లిఖితం.

Related posts