telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

పెద్దమొత్తంలో లిక్కర్‌ బిల్లు వైరల్‌..షాప్ యజమానిపై ఎఫ్‌ఐఆర్‌ !

liquor shops ap

లాక్ డౌన్ లో కేంద్రం కొన్ని సడలింపులివ్వడంతో పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో మద్యం షాపులవద్ద మందుబాబులు బారులు తీరారు. కర్ణాటకలో తొలిరోజు మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.45కోట్ల ఆదాయం లభించింది. పెద్దమొత్తంలో మద్యం కొనుగోలు చేసిన వ్యక్తులు లిక్కర్‌కు సంబంధించిన బిల్లులను సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో అందులో ఓ షాపు ఓనర్‌పై ఎక్సైజ్‌ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

బెంగళూరులోని వెనీలా స్పిరీట్‌ జోన్‌ నుంచి ఓ కస్టమర్‌ ఏకంగా రూ.52,841 విలువైన మద్యాన్ని కొనుగోలు చేశాడని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ గిరి తెలిపారు. లైసెన్స్‌ నిబంధనలు ఉల్లంఘించిన వెనీలా స్పిరీట్‌ జోన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు చెప్పారు. ఒక రోజులో ఒక కస్టమర్‌కు ఇండియన్‌ మేడ్‌ ఫారెన్‌ లిక్కర్‌ 2.3లీటర్లు, బీరు 18.2లీటర్ల కన్నా ఎక్కువ మొత్తంలో విక్రయించేందుకు రిటైల్‌ ఔట్‌లెట్లకు అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు.

Related posts