telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మే 7వ తేదీ నుంచి 64 ప్రత్యేక విమానాలు

Air India flight

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అతాలాకుతలమవుతున్నాయి. అనేక దేశాల్లో లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో భారతీయులు పెద్ద సంఖ్యలో విదేశాల్లో చిక్కుకుపోయారు. వారిని భారత్ కు తీసుకువచ్చేందుకు కేంద్రం భారీ కార్యాచరణ రూపొందించింది. విదేశాల్లో ఉంటున్న భారతీయుల కోసం మే 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 64 ప్రత్యేక విమానాలు నడపనుంది. ఇతర దేశాల్లో ఉన్న వేల మంది భారతీయులను దశల వారీగా తరలించనున్నారు.

భారత్ కు రావాలనుకుంటున్న పౌరుల నుంచి రుసుం వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. లండన్ నుంచి ఢిల్లీ వచ్చే విమానంలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.50 వేలు, ఢాకా నుంచి ఢిల్లీ వచ్చేందుకు రూ.12 వేలు వసూలు చేయాలని నిర్ణయించారు. తొలి విడతలో భాగంగా అమెరికా, గల్ఫ్ దేశాలు, మలేసియా, యూకే తదితర దేశాలకు విమానాలు నడపనున్నారు.

Related posts