బాలీవుడ్ నటుడు అమ్జాద్‌ఖాన్ సోదరుడు, ప్రముఖ నటుడు ఇమ్తియాజ్‌ఖాన్ కన్నుమూశారు.ఆయన వయసు 77 సంవత్సరాలు. ప్రముఖ టీవీ నటి కృతికా దేశాయ్‌కి ఇమ్తియాజ్‌ఖాన్ భర్త. బాలీవుడ్ తారలంతా ఇమ్తియాజ్‌ఖాన్ మృతికి సంతాపం తెలిపారు. ఇమ్తియాజ్‌ఖాన్ నటునిగా, దర్శకునిగా పేరు సంపాదించారు. ‘హల్‌చల్’, ‘ప్యార్ దోస్త్’, ‘గ్యాంగ్’ తదితర సినిమాల్లో నటించారు. బాలీవుడ్ నటుడు జావేద్ జాఫ్రీ ఒక ట్వీట్‌లో ఇమ్తియాజ్‌ఖాన్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ‘సీనియర్ యాక్టర్ ఇమ్తియాజ్‌ఖాన్ కన్నుమూశారు. అతనితో ‘గ్యాంగ్’ సినిమాలో నటించాను. ఇమ్తియాజ్‌ఖాన్ అద్భుతమైన నటుడు. మానవతావాది. భగవంతుడు అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానని’ అన్నారు. ఇమ్తియాజ్ ‘యాదోంకి బారాత్’, ‘ధర్మాత్మ’, ‘దయావన్’, ‘హల్‌చల్’, ‘ప్యార్ దోస్త్’, ‘గ్యాంగ్’ తదితర సినిమాల్లో నటించి మెప్పించారు. బాలీవుడ్ సినీ ప్రముఖులు ఇమ్తియాజ్ ఖాన్ మృతికి సంతాపం తెలిపారు. ఇమ్తియాజ్ ఖాన్ నటునిగా, దర్శకునిగా మంచి పేరు సంపాదించారు.