జగన్ ఎన్నో సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలు మళ్లించారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ఈ మేరకు ఐఐఎం అహ్మదాబాద్ కు బహిరంగ లేఖ రాశారు. పనిలోపనిగా జగన్ అవినీతిపైనా అధ్యయనం చేయాలని కోరారు. జగన్ పై 31 క్రిమినల్ కేసులతో పాటు సీబీఐ విచారణ కూడా కొనసాగుతోందని లేఖలో పేర్కొన్నారు.
జగన్ సీఎం అయ్యాక ఇసుక, మద్యం, మైనింగ్ లో భారీస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అంతేగాకుండా, ఐఐఎం అధ్యయనానికి పూర్తి సహకారం అందిస్తామని కళా వెంకట్రావు తన లేఖలో పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనకు ఐఐఎం అహ్మదాబాద్ తో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిసున్నారు.
కేంద్ర నిధులను రాబట్టడంలో జగన్ విఫలం: యనమల