telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో 18 మంది ఐఏఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

AP

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయా శాఖల ఉన్నతాధికారుల బదిలీలు జరుగుతున్నాయి. తాజాగా మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఏపీలో 18 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీ అయిన అధికారులు వీరే:

హౌసింగ్‌ ముఖ్య కార్యదర్శిగా అజయ్‌జైన్‌
మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్‌గా శారదాదేవి
ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీగా సుమిత్‌కుమార్‌
పరిశ్రమలు, పెట్టుబడులశాఖ కార్యదర్శిగా కాంతిలాల్‌ దండే
జి.అనంతరాముని జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని ఆదేశం
ఏపీటీఎస్‌ ఎండీగా నందకిషోర్‌
స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌శాఖ కమిషనర్‌, ఐజీగా సిద్ధార్థ జైన్‌
ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా డి.వాసుదేవరెడ్డి
కార్మికశాఖ ప్రత్యేక కమిషనర్‌గా జి.రేఖారాణి
గిడ్డంగుల కార్పొరేషన్‌ వీసీ, ఎండీగా భానుప్రకాష్‌
ఏపీ మినరల్‌ కార్పొరేషన్‌ వీసీ, ఎండీగా మధుసూదన్‌రెడ్డి
గిరిజన సహకారసంస్థ వీసీ, ఎండీగా పి.ఎ.శోభ
ఆయుష్‌ కమిషనర్‌గా పి.ఉషాకుమారి
సీసీఎల్‌ఏ జాయింట్‌ సెక్రటరీగా చెరుకూరి శ్రీధర్‌
రాజమండ్రి కార్పొరేషన్‌ కమిషనర్‌గా అభిజిత్‌ కిషోర్‌
ఇంటర్‌ విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌గా రామకృష్ణ
పట్టణ ఆర్థిక, మౌలిక అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా చంద్రమోహన్‌రెడ్డి
పునరావాస ప్రత్యేక కమిషనర్‌గా బాబూరావునాయుడు

Related posts