telugu navyamedia
రాజకీయ వార్తలు

రేపటి నుండే .. ఓటర్ల వివరాల పరిశీలన.. : ఈసీ

election-commission

కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్ట్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల వివరాలను పరిశీలించనుంది. ఈ మేరకు ఓటర్ జాబితా సవరణ షెడ్యూల్‌ను సీఈసీ ప్రకటించింది. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకూ ఓటర్ల జాబితాను తనిఖీ చేయనున్నారు. అనంతరం సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 15 వరకూ పోలింగ్ స్టేషన్లను గుర్తించనున్నారు.

ఈసీ అక్టోబర్ 15న ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేయనుంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకూ అభ్యంతరాలు స్వీకరించి, నవంబర్ 2,3 తేదీల్లో ఓటర్ల నమోదు స్పెషల్ క్యాంపెయిన్‌లు నిర్వహించనుంది. డిసెంబర్ 15 కల్లా వినతులను పరిష్కరించనుంది. డిసెంబర్ 31న మార్పులు, కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల పేర్లను చేర్చి.. ఓటరు జాబితాను ముద్రించనున్నారు. 2020 జనవరిలో తుది జాబితాను ఈసీ విడుదల చేయనుంది.

Related posts