telugu navyamedia
సామాజిక

500రూపాయలతో ఐఏఎస్ ల .. పెళ్లి..

ias 500 marriage
సాధారణంగా ఉన్నత ఉద్యోగాలలో ఉన్నవారు ఏ వేడుక చేసుకున్నా అది వారి స్టేటస్ కు తగ్గట్టుగా ఆడంబరంగానే ఉంటుంది. కానీ ఇటీవల కొందరు ఉన్నత ఉద్యోగులు నిరాడంబర జీవితానికి మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతో ఖర్చుతో కూడుకున్న పెళ్లిని, అత్యంత తక్కువ ఖర్చుతో ముగిస్తున్నారు. పెళ్లికి భారీగా ఖర్చుపెట్టి, ఆడంబరాలు చేసుకోవడం కన్నా, ఆ డబ్బును భవిష్యత్తులో వచ్చే ఆర్థిక ఇబ్బందులను తీర్చుకునేందుకు వాడుకోవడం ఉత్తమమని నమ్మిన ఓ యువ ఐఏఎస్ జంట, కేవలం రూ. 500 ఖర్చుతో తమ వివాహాన్ని చేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఈ వివాహానికి కర్ణాటక, హుబ్లీలోని మినీ విధానసౌధ వేదికైంది.
విజయవాడకు చెందిన హెప్సిబారాణి ప్రస్తుతం ఉడుపి జిల్లా అధికారిణిగా పనిచేస్తుండగా, పశ్చిమబెంగాల్‌ కు చెందిన కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్ ఉజ్వల్‌ కుమార్‌ ఘోష్‌ తో పరిచయం ఏర్పడింది. బాగల్‌ కోట జిల్లా కృష్ణా ఎగువ ప్రాజెక్టు కమిషనర్‌ గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. వీరి పరిచయం ప్రేమగా మారగా, పెద్దలను ఒప్పించారు. నిరాడంబరంగా వివాహం చేసుకోవాలని భావించి, అతి తక్కువ ఖర్చుతో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. నూతన జంటను బంధుమిత్రులు, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.

Related posts