telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వలస కార్మికుల గృహాలన్నీ కంటైన్ మెంట్ జోన్లు: అసోం ప్రభుత్వం

labour lockdwon

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. రాష్ట్రానికి వచ్చే వలసదారుల కుటుంబాలు నివసించే గృహాలన్నీ కంటైన్ మెంట్ జోన్లుగానే పరిగణించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారంతా 14 రోజులపాటు విధిగా హోమ్ క్వారంటైన్ లోనే ఉండాలని, లాక్ డౌన్ నిబంధనలన్నీ వర్తిస్తాయని స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ నుంచి వలస కార్మికులతో బయలుదేరిన ప్రత్యేక రైలు మంగళవారం నాడు అసోం చేరుకొన్నారు. కేసులు లేని రాష్ట్రంగా గుర్తింపు ఉన్న అసోం, ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల కారణంగా రాష్ట్రంలో వైరస్ ప్రబలకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కార్మికులు ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమాంత బిశ్వ శర్మ వివరించారు. ఎవరైనా వ్యక్తి, బయటి రాష్ట్రం నుంచి వచ్చి, ఇంట్లోకి వెళితే, ఆ ఇంట్లోని వారంతా, అత్యవసర వైద్యం కావాల్సి వస్తే తప్ప బయటకు వచ్చేందుకు వీల్లేదని ఆయన ఆదేశించారు.

Related posts