telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొరటాల శివ సంచలన ప్రకటన… మరో ఐదేళ్లలో రిటైర్మెంట్

koratala

సోషల్ మెసేజ్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జతచేసి ప్రేక్షకులు మెచ్చే ఒక మంచి మాస్ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు కొరటాల శివ దిట్ట. రచయితగా కెరీర్ స్టార్ట్ చేసి ‘మిర్చి’ ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’.. ఇలా వరుస సూపర్ హిట్స్‌తో ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ ఇవ్వడమే కాక టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా నిలిచారు కొరటాల. ఆయన ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన కేవలం నాలుగు సినిమాలే అయినా ప్రస్తతం టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా ఆయన క్రేజ్ సంపాదించారు. మరో ఐదేళ్లలో తాను రిటైర్ అవుతున్నట్టు స్వయంగా కొరటాల శివ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం తన దగ్గర ఉన్న స్క్రిప్టులతో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నానని, అవి పూర్తయిన తరవాత తాను దర్శకుడిగా రిటైర్మెంట్ తీసుకుంటానని కొరటాల శివ ప్రకటించారు. వీటిని పూర్తిచేయడానికి ఐదేళ్లు పట్టొచ్చని, ఆ తరవాత తాను రిటైర్ అవుతానని వెల్లడించారు. కొత్త దర్శకులను ప్రోత్సహించడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. దర్శకుడిగా రిటైర్మెంట్ తీసుకున్నా ఇండస్ట్రీని మాత్రం వదలనని అన్నారు.

కొత్త దర్శకులను ప్రోత్సహించడం కోసం తానే స్వయంగా ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటుచేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే, ఈ ఇంటర్వ్యూలోనే ‘ఆచార్య’ సినిమా గురించి కొరటాల శివ స్పందించారు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయినట్టు ఆయన వెల్లడించారు. రామ్ చరణ్ కోసం హీరోయిన్‌ను ఖరారు చేయాల్సి ఉందని చెప్పారు. ఇదొక సోషియో-పొలిటికల్ ఎంటర్‌టైనర్ అని శివ తెలిపారు. సహజ వనరులను పరిరక్షించడం కోసం ఒక వ్యక్తి చేసే పోరాటామే ‘ఆచార్య’ అని తెలిపారు. ఈ పాత్రలో చిరంజీవి అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడని చెప్పారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Related posts