telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

వంకాయ తింటున్నారా…. !

వంకాయను ఏడాది పొడవునా తీసుకుంటారు. చాలా మందికి వంకాయ అంటే చాలా ఇష్టం ఉంటుంది. తెలుగు వంటకాల్లో కూడా వంకాయ తప్పనిసరి. వంకాయ అంటే తెలియనవారుండరు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ వంకాయలు ఉంటాయి. చాలా మంది ఇష్టపడి వంకాయ కూర తింటారు. అయితే.. ఈ వంకాయ వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. వంకాయ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు వైద్య నిపుణులు. జ్వరంగా ఉన్నప్పుడు వంకాయను అసలు తీసుకోకూడదు. వంకాయ తింటే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే ఫీవర్‌గా ఉన్నప్పుడు మీ డైట్‌లో వంకాయను అసలు భాగం చేయద్దు. ఎలర్జీ కలిగే అవకాశం ఉంటుంది. డయాబెటిస్‌ ఉన్న పెషెంట్లు వంకాయ నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే వంకాయ తినడం వల్లఅ రక్తంలో చెక్కర శాతం పెరుగుతుంది. వంకాయ తినడం వల్ల డైజషన్‌ మెరుగు అవుతుంది. ఇది మంచితే కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో మంట వచ్చే అవకాశం ఉంటుంది. వంకాయను ఇష్టపడే వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. వంకాయను తీసుకోవడం వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. రక్తపోటు సమస్య ఉన్న వాళ్లు వంకాయ నుంచి కాస్త దూరంగా ఉండాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

Related posts