telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ట్రంప్ చెబుతున్న దాంట్లో నిజం లేదు: కమలా హారిస్

Kamala Harris

ఈ ఏడాది చివరి నాటికి, లేదంటే అంతకంటే ముందే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్ స్పందించారు. టీకా విషయంలో ట్రంప్ చెప్పే మాటల్ని విశ్వసించడానికి లేదని అన్నారు.

ట్రంప్ చెబుతున్నట్టుగా ఎన్నికల నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా దాని సామర్థ్యం, భద్రతపై తనకు నమ్మకం లేదన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసమే వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేయాలని ట్రంప్ ఆయా సంస్థలపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపణలు వెల్లు విరుస్తున్నాయి.ట్రంప్ చెబుతున్న దాంట్లో నిజం లేదని, అదంతా ఎన్నికల గిమ్మిక్కేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమలా హారిస్ కూడా విమర్శలు చేయడం గమనార్హం.

Related posts