గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలపై మాజీ సీఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ స్పందించారు.
షర్మిల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తొలిసారి స్పందించారు వైసీపీ అధినేత జగన్. వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేశారో.. లేదో.. తనకు తెలియదన్నారు.
గతంలో తెలంగాణ రాజకీయాల్లో షర్మిల యాక్టివ్‌గా ఉన్నారు. అందుకే చేసి ఉంటారేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు.
తెలంగాణ వ్యవహారంతో తనకు సంబంధం లేదని వైఎస్ జగన్ చెప్పారు.
అయితే, ఇది అన్నా చెల్లెల్ల వ్యవహారమే అయినా పక్క రాష్ట్రం అంశమైనా అవసరమైతే తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందంటున్నారు ఏపీ మంత్రులు. దీనితో పాటు వైసీపీ హయాంలో చాలా కుట్రలు జరిగాయనీ అన్నీ బయటకు తీస్తామని చెప్పారు.


అప్పులే తప్ప తన వద్ద డబ్బులేమీ లేవు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి