ఇప్పటివరకు ఏపీ రాజధానిపై స్పష్టత కోసం నియమించిన కమిటీలు చెప్పినట్టే .. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణకు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు హైపవర్ కమిటీ సభ్యులు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్‌రావు, బీసీజీ ఇచ్చిన నివేదికపై హైపవర్ కమిటీ చర్చించింది. మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కన్నబాబు మాట్లాడారు. జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై చర్చించినట్లు వెల్లడించారు. తదుపరి సమావేశాల్లో మరింతగా చర్చించి సీఎంకు నివేదిక అందజేస్తామన్నారు.
అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలు గౌరవించాలని సభ్యులు కోరారు. ప్రస్తుతం ప్రాథమికంగా మాత్రమే చర్చించామన్నారు. చరిత్రలో జరిగినవి కూడా విశ్లేషించినట్లు స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి రాజకీయ ప్రేరేపితమని వ్యాఖ్యానించారు.