telugu navyamedia
ఆంధ్ర వార్తలు

‘బైజూస్’ అంటే మ్యాంగో జ్యూసో, హెరిటేజ్ జ్యూసో కాదు..మీ మ‌న‌వ‌డి అడిగితే తెలుస్తోంది – బొత్స

టీడీపీ అధినేత చంద్రబాబుకు మతిస్థిమితం పోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు..బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, హెరిటేజ్ జ్యూసో కాదని.. మీ మనవడిని అడిగితే తెలుస్తుందంటూ మంత్రి సెటైర్లు వేశారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గానికి వెళ్లి తాను ఒక పనికిమాలిన వ్యక్తి అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడారు

పనికి మాలినతనానికి చంద్రబాబుదే పేటెంట్ హక్కు.. దేశరాజకీయాల్లో పనికిమాలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే ఆయన చంద్రబాబు అని బొత్స అన్నారు.

బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని బొత్స దుయ్యబట్టారు. మమ్మీ, డాడీ అని పిలవడం కోసం ఇంగ్లీష్ మీడియం అని చంద్రబాబు అంటున్నారని… అందుకేనా మీ కొడుకుని ఇంగ్లీష్ మీడియంలో చదివించారు? అందుకేనా విదేశాలకు పంపించింది? అని బొత్స ప్రశ్నల వర్షం కురిపించారు. పేద పిల్లలకు కూడా అంతర్జాతీయ కంటెంట్ అందుబాటులో ఉండాలనే బైజూస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని సత్యనారాయణ స్పష్టం చేశారు.

ఏపీకి సంబంధించి ఒకటైనా పనికొచ్చే విషయం మాట్లాడారా?.. పేదపిల్లలకు అంతర్జాతీయ కంటెంట్ అందుబాటులో ఉండాలనే.. బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నామ‌ని అన్నారు.

”సామాజికి న్యాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు.బైజూస్ త‌ప్ప‌వ‌ని ప్ర‌పంచంలో ఏ ఒక్క‌రితో అయినా చెప్పిస్తావా? అంటూ బొత్స మండిప‌డ్డారు. 35ల‌క్ష‌ల మంది పేద విద్యార్ధుల‌కు ఉచితంగా బైజూస్‌తో అవ‌గాహ‌న క‌ల్పింస్తుంటే విమ‌ర్శ‌లు చేస్తారా అంటూ నిల‌దీశారు.

బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం తప్పని ఒక్కరితోనైనా చెప్పిస్తారా?.. అంటూ బొత్స మండిప‌డ్డారు. సామాజిక న్యాయంపై చర్చకు మేం కూడా సిద్ధమే. చంద్రబాబు వస్తారా.. ఆయన తాబేదారులు వస్తారా?’’ అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

Related posts