telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జూన్ 2 తరువాత కూడా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి: లక్ష్మీనారాయణ

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్-5 ప్రకారం హైదరాబాద్ నగరం ఏపీ, తెలంగాణలకు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్న సంగతి తెలిసిందే.

జూన్ 2వ తేదీతో ఆ గడువు ముగిసిపోనుంది.

ఈ నేపథ్యంలో, సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధినేత వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు.

హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్లకు మించి కొనసాగించాలనే అంశాన్ని ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు వెంటనే లేవనెత్తాలని పిలుపునిచ్చారు.

ఏపీకి ఇంత వరకు రాజధాని ఏర్పడనందున, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడిగిస్తూ భారత రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు.

Related posts