telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

చిదంబరంకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు!

congress chidambaram

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ కస్టడీలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. చిదంబరం అరెస్టయిన రెండు నెలల తర్వాత ఆయనకు బెయిల్‌ లభించడం గమనార్హం.

ఈ కేసులో తనకు బెయిల్‌ నిరాకరిస్తే ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ చిదంబరం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో చిదంబరంను సీబీఐ ఆగస్ట్‌ 21న అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంతో పాటు మరికొందరు ఉన్నతాధికారులపైనా సీబీఐ చార్జిషీట్‌ నమోదైంది. ప్రస్తుతం బెయిల్ మంజూరు అయినా, ఈడీ కస్టడీలో ఉన్నందున 24వ తేదీ వరకూ ఆయన విడుదల అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.

Related posts