మరికొద్ది గంటల్లో ప్రపంచ ఎనర్జీ క్యాపిటల్ అయిన హ్యూస్టన్ నగరంలో ‘హౌదీ మోదీ’ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఇందులో భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలిసారి ఒకే వేదికను పంచుకోబోతున్నారు. దాదాపు 72వేల మంది ప్రత్యక్షంగా వీక్షించగల సామర్థ్యమున్న హ్యూస్టన్లోని ఎన్ఆర్జీ ఫుట్బాల్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. అయితే దాదాపు 50 వేల మందికి పైగా భారతీయ అమెరికన్లు ఈ కార్యక్రమానికి హాజరవుతుండడం, సుమారు 600 సంస్థలు కలిసి దీన్నినిర్వహిస్తుండడంతో హౌదీ మోదీ కార్యక్రమం ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ప్రపంచలోనే ఇద్దరు అగ్ర దేశాధినేతలు హాజరవుతోన్న ఈ మెగా ఈవెంట్ లైవ్ అబ్డేట్స్ టీవీ9 మీకు అందించబోతుంది.
							previous post
						
						
					
							next post
						
						
					

